లావణ్య అంబటి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;లావణ్య అంబటి

గురువు గారికి నమస్కారములు,

నేను మీ వ్యాసాన్ని 2024లో చదివాను. ఉదరమున నెదురు పుట్టె–ఇది చదవగానే నాకో అర్ధం స్పురించింది. సీత రామునికి దూరమైన బాధతో చిక్కి శల్యమైనట్లు చెప్పుట కొరకు వాడినట్లు తోచినది. ఆమె బక్కచిక్కి పోవుట వలన వెన్నెముక మాత్రమే కనపడుతున్నదనే అర్ధంలో వెన్నెముకని వెదురుతో పోల్చి ఉండవచ్చును.

ఈ విధముగా ఆ వాక్యాన్ని అర్ధం చేసుకోవచ్చునా? తెలుపగలరు.

ధన్యవాదములు.


24 April 2024 11:20 PM